తల్లిని చంపిన ఇద్దరు బాలురు.. అరెస్టు చేసిన పోలీసులు

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. నిత్యం మద్యం తాగివచ్చి తమను వేధిస్తుందన్న కారణంతో ఇద్దరు కుమారులు తల్లిని పాశవికంగా ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చారు. భువనేశ్వర్ జిల్లా సుందర్‌పాడ ఈ ఘటన జరిగింది. ఘాతుకానికి ఒడిగట్టిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందర్‌పాడ ప్రాంతంలో ఓ మహిళ(40)కు ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. మద్యానికి బానిసైన ఆమె నిత్యం తాగివచ్చి పిల్లలను హింసించేది. గురువారం రాత్రి సైతం పూటుగా మద్యం తాగి కుమారులతో గొడవపడింది.
మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన ఇద్దరు కుమారులు పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో ఆమెను కర్కషంగా చావబాదారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను బాధితురాలిని దవాఖానకు తరలించేలోగా మృతి చెందిందని భువనేశ్వర్ పోలీసు డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) ఉమాశంకర్ డాశ్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మృత్యువులోనూ వీడని స్నేహం
- ట్రాఫిక్ వయోలేషన్ ప్రీమియం
- కడుపుకోత
- దిగొచ్చిన తాండవ్: భేషరతుగా క్షమాపణ
- మాల్యాను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం
- రైతు సంక్షేమమే ధ్యేయం
- రెండేండ్లలో 1,000 అవుట్లెట్లు
- తాను మరణించి.. మరో ఐదుగురిని బతికించి
- టీచర్ల ఫోన్లలో ఆన్లైన్ పాఠాలు
- హుజూరాబాద్‌లో ప్రాచీన యుగపు ఆనవాళ్లు