బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 14:43:11

నదిలో ఈతకు వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి

నదిలో ఈతకు వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి

కోటా : సరదాగా నదిలో ఈతకు వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. రాజస్థాన్లోని ‌జలావర్ ‌జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. బరోడియా గ్రామానికి చెందిన రామ్‌లాల్ గుర్జార్ కుమార్తె సునీత (14) అతని సోదరుడు నారాయణ్‌ కుమార్తె లక్ష్మీబాయి (13) రోజువారీగా శివారులోని ఉజ్జాద్ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూ నదిలో లోతైన ప్రాంతానికి వెళ్లి తిరిగి ఒడ్డుకు వచ్చే క్రమంలో అలసటకు గురై ప్రవాహ ఉద్ధృతిలో గల్లంతయ్యారు. పోలీసులు, గ్రామస్తులు గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇద్దరికీ ఈత బాగా తెలుసని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo