శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 14:22:19

బస్సు బోల్తా : ఇద్దరు దుర్మరణం.. 36 మందికి గాయాలు

బస్సు బోల్తా : ఇద్దరు దుర్మరణం.. 36 మందికి గాయాలు

ఉజ్జయిని : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌ నియమించిన కార్మికులు పని నిమిత్తం అహ్మదాబాద్ వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది.

ఘటనా స్థలంలోనే 24 ఏండ్ల కార్మికుడు మృతి చెందగా, 26 ఏండ్ల వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు మూలమలుపును డ్రైవర్‌ స్పష్టంగా అంచనా వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. క్షతగాత్రులను వివిధ దవాఖానల్లో చేర్చామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo