గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 06:39:37

బెంగాల్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

బెంగాల్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

ఉత్తర 24 పరగణాలు :  పశ్చిమ బెంగాల్‌లోని కమర్హతి గోలఘాట్ ప్రాంతంలో ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులని సాజిద్, రాజాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం వచ్చిన తరువాత, కమర్హతి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన నలుగురిని సమీపంలోని దవాఖానకు తరలించారు. అందులో ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo