శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 16:05:25

హర్యానాలో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

హర్యానాలో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

గురుగ్రామ్‌:  హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రెండు అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్లను ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. లక్షల విలువైన మాదకద్రవ్యాలతోపాటు కరోనా మందులను స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 56తోపాటు సదర్ ప్రాంతంలోని రెండిళ్లలో అక్రమంగా మాదకద్రవ్యాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు,  డ్రగ్‌కంట్రోల్‌ అధికారులు నలుగురు ఇరాక్ పౌరులను, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఓ మహిళను అరెస్టు చేసి వారి నుంచి రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌తోపాటు రూ.75 లక్షల నగదు, ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ డ్రగ్ కంట్రోలర్ అధికారి అమన్‌దీప్ చౌహాన్ తెలిపారు. నిందితులు అంతర్జాతీయ మార్కెట్లలో చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని, స్వాధీనం చేసుకున్న వాటిలో కరోనా మందులు, క్యాన్సర్‌ మందులు, మాదకద్రవ్యాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 


logo