శనివారం 16 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 14:30:11

మేడ్చ‌ల్‌లో రోడ్డుప్ర‌మాదం : ఇద్ద‌రు విద్యార్థులు మృతి

మేడ్చ‌ల్‌లో రోడ్డుప్ర‌మాదం : ఇద్ద‌రు విద్యార్థులు మృతి

మేడ్చ‌ల్ : సూరారం క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వేగంగా వ‌చ్చిన బైక్ అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన‌డంతో.. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను విశాల్‌(21), సుజిత్ కుమార్‌(23)గా గుర్తించారు. విద్యార్థుల బ్యాగులో కిలో గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. ఈ ఇద్ద‌రు విద్యార్థులు సెయింట్ పీట‌ర్స్ కాలేజీలో ఇంజినీరింగ్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గంజాయి సేవించి వాహ‌నం న‌డిపారా? లేక గంజాయి విక్ర‌యిస్తున్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ‌