శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 16:39:51

తండ్రికొడుకుల‌ను బ‌లిగొన్న భూవివాదం

తండ్రికొడుకుల‌ను బ‌లిగొన్న భూవివాదం

ల‌క్నో : ఇరు వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్న భూవివాదం తండ్రికొడుకుల‌ను బ‌లిగొన్న‌ది. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌తాప్‌ఘ‌ర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉద‌యం చోటు చేసుకుంది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్న భూవివాదానికి సంబంధించి గ్రామంలో పెద్ద‌లు పంచాయితీ పెట్టారు. దీనికి ఇద్ద‌రు న్యాయ‌వాదులు, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఇద్ద‌రు పోలీసులు కూడా హాజ‌ర‌య్యారు. పంచాయితీ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ వ‌ర్గం వారు మ‌రో వ‌ర్గంపై దాడి చేశారు.

ఈ స‌మ‌యంలో పోలీసులు కూడా వారిని అడ్డుకోలేక‌పోయారు. ఈ ఘర్ష‌ణ‌లో తండ్రికుమారులిద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల‌ను ద‌యాశంక‌ర్ మిశ్రా(తండ్రి), ఆనంద్  మిశ్రా(కుమారుడు)గా పోలీసులు గుర్తించారు. అయితే స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రి పోలీసుల‌ను ప్ర‌తాప్‌ఘ‌ర్ ఎస్పీ స‌స్పెండ్ చేశారు. దాడికి పాల్ప‌డ్డ రాజేశ్ కుమార్ మిశ్రాతో పాటు ఆయ‌న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపేందుకు నాలుగు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఎస్పీ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు మోహ‌రించారు.


logo