సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 15:33:45

సైనిక్‌పురిలో రూ. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ

సైనిక్‌పురిలో రూ. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ

హైదరాబాద్‌ : నగరంలోని సైనిక్‌పురిలో భారీ చోరీ జరిగింది. తన ఇంట్లో భారీ చోరీ జరిగిందని వ్యాపారి నర్సింహారెడ్డి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపై మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత స్పందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారని తెలిపారు. ఇంట్లో ఉన్న 1.73 కిలోల బంగారం, రూ. 2 లక్షలతో పాటు విలువైన వస్తువులను దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని డీసీపీ పేర్కొన్నారు. చోరీ జరిగిన నివాసంలో నేపాల్‌ వాసి భీమ్‌ దంపతులు గత 6 నెలల నుంచి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.

బాధితుడి కుటుంబ సభ్యులు ఓ పని నిమిత్తం బయటకు వెళ్లొచ్చేసరికి ఈ చోరీ జరిగింది. ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. భీమ్‌ దంపతులు కూడా లేకపోవడంతో.. వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 7 బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయంలో ప్రత్యేక నిఘా పెట్టాం. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నాం. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. 


logo