శనివారం 31 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 13:31:26

మొబైల్ దొంగ‌ల‌కు దేహ‌శుద్ధి

మొబైల్ దొంగ‌ల‌కు దేహ‌శుద్ధి

ప‌ట్నా: బీహార్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లాలోని మిథ‌న్‌పుర ఏరియాలో ఇద్ద‌రు మొబైల్ ఫోన్ దొంగ‌ల‌కు దేహ‌శుద్ధి జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే బైకుపై వ‌చ్చిన ఇద్ద‌రు దొంగ‌లు రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న వ్య‌క్తి చేతిలోని ఫోన్‌ను లాక్కుని పారిపోతుండ‌గా స్థానికులు వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. అనంత‌రం క‌రెంటు స్తంభానికి క‌ట్టేసి దేహ‌శుద్ధి చేశారు. ఆ త‌ర్వాత పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా వారు వ‌చ్చి నిందితులు ఇద్ద‌రిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 

మిథ‌న్‌పుర నుంచి స్థానికులు ఫోన్ చేసి దొంగ‌తనానికి సంబంధించిన స‌మాచారం ఇచ్చార‌ని, తాము అక్క‌డికి వెళ్లేస‌రికే స్థానికులు నిందితులను క‌రెంట్ స్తంభానికి క‌ట్టేసి కొడుతున్నార‌ని, స్థానికుల నుంచి నిందితులను విడిపించి అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వారు తెలిపారు.      లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.