గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 07, 2020 , 11:53:54

రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న బాలికను.. నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి..

రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న బాలికను.. నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి..

బల్లియా : 17 ఏండ్ల మైనర్‌పై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం బల్లియా జిల్లా రాస్టా రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. 

వివరాలు.. ఓ 17 ఏండ్ల బాలిక మావ్‌ జిల్లా నుంచి తన అమ్మమ్మను కలవడానికని బల్లియా జిల్లాలోని రాస్టా రైల్వేస్టేషన్‌కు బుధవారం సాయంత్రం చేరుకుంది. బాలిక ఒంటరిగా రైల్వే స్టేషన్‌లో అటూ ఇటూ తిరుగుతుండడాన్ని గమనించిన  ఓ నలుగురు వ్యక్తులు ఆమెనే అనుసరిస్తూ.. ‘నీవెళ్లాల్సిన ప్రదేశానికి తీసుకెళ్తామ’ని నమ్మబలికి  ఈ-రిక్షాను ఎక్కించారు. ఆ తరువాత రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి బాలికను తాక్కెళ్లి ఒకరి తరువాత ఒకరు, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. 

ఈ సమయంలో బాలిక పెద్దగా కేకలు పెడుతుండడంతో స్థానికులు ఘటనా స్థలానికి వస్తుండడాన్ని గమనించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాలికను దవాఖానకు తరలించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ 25 నుంచి 35 ఏండ్ల లోపు ఉండొచ్చని, స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారని, బాలిక నివేదిక అనంతరం వారిపై కేసులు నమోదు చేస్తామని ఏఎస్పీ సంజయ్ యాదవ్ గురువారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo