మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 14:08:31

యువ‌తిపై సామూహిక అత్యాచారం.. 10 మంది అరెస్ట్

యువ‌తిపై సామూహిక అత్యాచారం.. 10 మంది అరెస్ట్

అగ‌ర్త‌లా : ఓ యువ‌తి ప‌ట్ల కామాంధులు చెల‌రేగిపోయారు. ఆమెను ఒంట‌రి చేసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న త్రిపుర‌లోని కోవాయి జిల్లాలో జులై 21న చోటు చేసుకోగా నిందితుల‌ను శుక్ర‌వారం అరెస్టు చేశారు. 

కోవాయి జిల్లాలోని ఖాసియ‌మంగ‌ల్ అట‌వీ ప్రాంత గ్రామంలో ఓ 17 ఏళ్ల యువ‌తి ఒంట‌రిగా ఉంది. ఆ స‌మ‌యంలో ముగ్గురు యువకులు ఆమెను బ‌ల‌వంతంగా అడ‌విలోకి లాక్కెళ్లారు. ఆ త‌ర్వాత ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేకు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. ఐదుగురు అత్యాచారం చేయ‌గా, మిగ‌తా వారు వారికి ఆశ్ర‌యం క‌ల్పించి స‌హ‌క‌రించార‌ని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు చెప్పారు.

ఇలాంటి ఘ‌ట‌న‌ల ప‌ట్ల క‌ఠినంగా ఉండాల‌ని త్రిపుర యూనివ‌ర్సిటీ విద్యార్థి అస్మిరా దేవ్ వ‌ర్మ అన్నారు. అత్యాచారాల‌కు వ్య‌తిరేకంగా వాట్సాప్ లో ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. అత్యాచారాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌న్నారు వ‌ర్మ‌. అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను స‌హించేదే లేద‌ని వ‌ర్మ స్పష్టం చేశారు.


logo