బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 16:10:37

బాలిక అకౌంట్లోకి రూ.10 కోట్లు ఎలా వచ్చాయబ్బా?!

బాలిక అకౌంట్లోకి రూ.10 కోట్లు ఎలా వచ్చాయబ్బా?!

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఓ 16 ఏండ్ల బాలిక బ్యాంకు అకౌంట్లో రూ.10 కోట్లు జమయ్యాయి. బ్యాలెన్స్‌ గురించి ఆరా తీసిన ఆ అమ్మాయి.. రూ.10 కోట్లు అని చెప్పేసరికి దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. అమ్మాయి ఖాతాలోకి  డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు ఆరా తీస్తున్నారు.

బల్లియా జిల్లా బాన్స్‌దిహ్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బల్లియా జిల్లాకు చెందిన ఓ అమ్మాయికి గత రెండేండ్లుగా బాన్స్‌దిహ్‌లోని అలహాబాద్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఖాతా ఉన్నది. తన అకౌంట్లో నిలువ గురించి తెలుసుకునేందుకు ఆ బాలిక బ్యాంకు వెళ్లి ఆరా తీయగా.. రూ.9.99 కోట్లు అని బ్యాంకు అధికారులు చెప్పారు. దాంతో హతాశురాలైన సదరు బాలిక విషయాన్ని వెంటనే బాన్స్‌దిహ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వివరాలు అందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కాన్పూర్ దేహాట్ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ పేరు గత ఒక వ్యక్తి రెండేండ్ల క్రితం 16 ఏళ్ల యువకుడి వ్యక్తిగత గుర్తింపు వివరాలను కోరగా.. తన ఆధార్ కార్డు, ఫొటో కోసం సరోజ్ అనే అమ్మాయిని అడిగాడు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద తన ఖాతాలోకి నిధులను బదిలీ చేయడానికి ఇవి అవసరమని చెప్పాడు. అప్పుడు నీలేష్‌ కుమార్‌ చెప్పిన నిధులు ఈ డబ్బేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరి బ్యాంకు అకౌంట్లో జమ అవదని, ఇందులో ఏదో గూడుపుఠాని దాగివున్నదని పోలీసులు భావిస్తున్నారు. సైబర్‌ క్రైం దొంగలే ఈ బాలిక బ్యాంకు ఖాతాను వాడుకుంటున్నట్లుగా  అనుమానిస్తున్నారు.


logo