మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 17, 2020 , 20:31:58

అక్ర‌మ డంపింగ్‌... 150 ట్ర‌క్కుల ఇసుక‌ సీజ్‌

అక్ర‌మ డంపింగ్‌... 150 ట్ర‌క్కుల ఇసుక‌ సీజ్‌

ఖ‌మ్మం : భారీ మొత్తంలో ఇసుక అక్ర‌మ డంపింగ్‌ను గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ముదిగొండ మండ‌లం గంధ‌సిరి గ్రామ స‌మీపంలో ఇసుక అక్ర‌మ డంపింగ్‌పై అధికారుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్తంగా రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా చేప‌ట్టిన సోదాల్లో 150 ట్ర‌క్కుల ఇసుక‌ను గుర్తించారు. ఇసుక‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు బుక్ చేశారు. నిందితుడిని గుర్తించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.   


logo