శుక్రవారం 27 నవంబర్ 2020
Crime - Oct 30, 2020 , 20:42:00

బాలికపై రెండు రోజుల్లో నలుగురు అత్యాచారం

బాలికపై రెండు రోజుల్లో నలుగురు అత్యాచారం

ముంబై: ఒక బాలికపై రెండు రోజుల్లో నలుగురు లైంగిక దాడి చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ దారుణం వెలుగుచూసింది. హదప్సర్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే కుటుంబానికి చెందిన 15 ఏండ్ల బాలిక ఈ నెల 26న తల్లితో గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఒక ఆటో డ్రైవర్‌ ఆమెను ఎక్కించుకుని రామ్‌టెక్డి ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అనంతరం హదప్సర్‌ బస్టాండ్‌ వద్ద వదిలేయగా మరో వ్యక్తి ఆ బాలికను భేక్రాయ్ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 27న బోప్గావ్ వెళ్లే బస్సులో ఆమెను ఎక్కించాడు. ఆమె అక్కడికి చేరుకోగా ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక తిరిగి తన ఇంటికి వచ్చి జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు హదప్సర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. బాలికపై లైంగికదాడి చేసిన నలుగురు నిందితుల్లో ఆటో డ్రైవర్‌తోపాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నారు. సామూహిక లైంగికదాడితోపాటు పొస్కొ చట్టం సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులకు ముందుగానే పరిచయం ఉన్నదా అని ఆరా తీస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.