శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 17:06:56

బాలికపై ముగ్గురు లైంగిక దాడి.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరింపు

బాలికపై ముగ్గురు లైంగిక దాడి.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరింపు

బరేలీ : ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏండ్ల బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేసి ఆ తతంగాన్నంతా వీడియో తీశారు. ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదించారు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. వివరాలివి.. నిందితులలో ఓ యువకుడు కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడు. బుధవారం బాలికను అతడు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో అక్కడే ఉన్న ఆ యువకుడి ఇద్దరు స్నేహితులు ఆమెను ఇనుపరాడ్డుతో కొట్టి ముగ్గురు కలిసి పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్‌ఎస్పీ శైలేశ్‌ పాండే చెప్పారు. నిందితులలో ఒకరు ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు.  నిందితులు మోహిత్ (25), సుమిత్ (27), అంకిత్ (24) పై కేసు నమోదు చేశారు. మోహిత్, సుమిత్‌లను బుధవారం అరెస్టు చేయగా అంకిత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo