తరగతి గదిలో విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపిన స్టూడెంట్

లక్నో: తరగతి గదిలో తోటి విద్యార్థిని మరో విద్యార్థి తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూమ్‌లో కూర్చొనే సీటు కోసం గొడవ పడ్డారు. అనంతరం ఒక విద్యార్థి తన ఇంటికి వెళ్లాడు. అంకుల్‌కు చెందిన లైసెన్స్ గన్ను తెచ్చి గొడవ పడిన విద్యార్థిపై కాల్పులు జరుపడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ స్కూల్‌కు వెళ్లి నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వినియోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థి అంకుల్ ఆర్మీలో పని చేస్తారని, సెలవుపై ఇంటికి రావడంతో ఆయనకు తెలియకుండా గన్ తెచ్చి తోటి స్టూడెంట్‌పై కాల్పులు జరిపాడని పోలీస్ అధికారి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్
- 116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్