బుధవారం 20 జనవరి 2021
Crime - Oct 17, 2020 , 17:41:59

ర‌హ‌స్య భాగాల్లో బంగారం.. ముగ్గురు అరెస్ట్‌

ర‌హ‌స్య భాగాల్లో బంగారం.. ముగ్గురు అరెస్ట్‌

చెన్నై: క‌స్ట‌మ్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు గ‌ట్టి నిఘా వేస్తూ ఎంత మంది ఆట క‌ట్టిస్తున్నా బంగారాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేసే ముఠాల ఆగ‌డాలు మాత్రం త‌గ్గడంలేదు. దేశ‌వ్యాప్తంగా రోజూ ఏదో ఒక రాష్ట్రంలో బంగారం స్మ‌గ్ల‌ర్‌లు ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. తాజాగా చెన్నైలో ముగ్గురు బంగారం స్మ‌గ్ల‌ర్‌లు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు దొరికారు. శ‌నివారం దుబాయ్ నుంచి చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 14 మంది వ‌చ్చారు. వారి ప్ర‌వ‌ర్త‌న అనుమానాస్ప‌దంగా క‌నిపించడంతో అక్క‌డి క‌స్ట‌మ్స్ అధికారులు వారిని లోప‌లికి తీసుకెళ్లి త‌నిఖీ చేశారు. 

అందులో ముగ్గురి పురీష‌నాళాల్లో బంగారం ఉండ‌లు దాచుకున్న‌ట్లు గుర్తించి బ‌య‌టికి తీయించారు. అనంత‌రం ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుల నుంచి సేక‌రించిన బంగారాన్ని తూకం వేయ‌గా 4.14 కేజీలు తూగిందని, ఈ బంగారం విలువ దాదాపు రూ.2.16 కోట్లు ఉంటుంద‌ని చెన్నై ఎయిర్‌పోర్టులోని క‌స్ట‌మ్స్ క‌మిష‌నర్ తెలిపారు. నిందితులు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని చిన్న‌చిన్న ర‌బ్బ‌రు ట్యూబుల్లో నింపి, వాటిని పురీష‌నాళాల్లో దాచుకున్నార‌ని ఆయ‌న చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo