సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 11:59:22

13 ఏళ్ల బాలిక నాలుక క‌త్తిరించి.. అత్యాచారం

13 ఏళ్ల బాలిక నాలుక క‌త్తిరించి.. అత్యాచారం

ల‌క్నో : ఓ ఇద్ద‌రు యువ‌కులు కామంతో చెల‌రేగిపోయారు. అమాయ‌క‌పు ఓ 13 ఏళ్ల బాలిక ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. ఆమెను బ‌ల‌వంతంగా లాక్కెళ్లి.. నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

నేపాల్ స‌రిహ‌ద్దులోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక‌పై ఇద్ద‌రు యువ‌కులు క‌న్నేశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం బాలిక‌ను ఇద్ద‌రు యువ‌కులు చెరుకు తోటల్లోకి బ‌ల‌వంతంగా తీసుకెళ్లారు. ఆమెపై ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశారు. 

త‌మ కూతురు క‌న‌బ‌డ‌క‌పోయేస‌రికి త‌ల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెత‌క్క‌గా.. స‌మీపంలో ఉన్న చెరుకు తోటల్లో శ‌వ‌మై క‌నిపించింది. బాలిక నాలుక క‌త్తిరించి, గొంతు కోసి చంపిన‌ట్లు తండ్రి తెలిపాడు. క‌ళ్ల‌ను కూడా బ‌య‌ట‌కు లాగిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నాడు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలిక క‌ళ్ల‌ను బ‌య‌ట‌కు లాగిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి కాలేద‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులిద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘ‌ట‌న‌పై బీఎస్పీ చీఫ్ మాయావ‌తి స్పందించారు. బాలిక ప‌ట్ల అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించి.. చంపేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించిన ఆమె.. స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌భుత్వానికి, బీజేపీ ప్ర‌భుత్వానికి తేడా ఏం లేద‌న్నారు. ఈ రెండు ప్ర‌భుత్వాల హ‌యాంలో నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయ‌ని మాయావ‌తి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.


logo