మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 19, 2021 , 20:12:15

కుల్సుంపురాలో బాలిక అదృశ్యం

కుల్సుంపురాలో బాలిక అదృశ్యం

హైదరాబాద్‌ : నగరంలోని కుల్సుంపురా పరిధిలో మంగళవారం ఓ బాలిక అదృశ్యమైంది. తొమ్మిదో తరగతి చదువుతున్న అన్నపూర్ణ(13) అనే విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి పేట్లబుర్జులో నివాసం ఉంటుంది. తండ్రి కిరాణా దుకాణంలో పనిచేస్తుంటాడు. తల్లి గృహిణి. బాలిక మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అంతటా వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో బాధిత తల్లిదండ్రులు కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న టీనేజర్‌(ఇతడు కూడా మైనరే) బాలిక అదృశ్యానికి కారణమై ఉండొచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాలనీలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

VIDEOS

logo