శనివారం 16 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 13:48:24

13 ఏండ్ల బాలిక‌పై గ్యాంగ్‌రేప్‌.. మ‌హిళ స‌హా ఏడుగురు అరెస్ట్‌

13 ఏండ్ల బాలిక‌పై గ్యాంగ్‌రేప్‌.. మ‌హిళ స‌హా ఏడుగురు అరెస్ట్‌

నాసిక్‌: మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ జిల్లాలో దారుణం జ‌రిగింది. 13 ఏండ్ల బాలిక‌పై ఐదుగురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాలిక ఇంటి ప‌క్క‌న బిల్డింగ్‌లోనే ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత్యాచారానికి పాల్ప‌డిన ఐదుగురు యువ‌కుల‌తోపాటు వాళ్ల‌కు స‌హ‌క‌రించిన ఓ మ‌హిళ‌ను, మైన‌ర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. నాసిక్ జిల్లాలోని నాసిక్ రోడ్ ఏరియాలో 13 ఏండ్ల బాలిక తన త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్న‌ది. ఎప్ప‌టిలాగే శ‌నివారం కూడా బాలిక త‌ల్లిదండ్రులు ప‌నుల‌కు వెళ్ల‌డంతో బాలిక ఒంట‌రిగా ఇంట్లో ఉన్న‌ది. అయితే, వారి ఇంటి ప‌క్క‌న బిల్డింగులో ఉండే యువ‌కుల క‌న్ను ఆ బాలిక‌పై ప‌డింది. దాంతో స‌ద‌రు యువ‌కులు ఓ మ‌హిళ‌, మ‌రో మైన‌ర్ బాలుడి సాయంతో ఆ బాలిక‌ను బిల్డింగ్‌పైకి ర‌ప్పించుకుని సామూహిక అత్యాచారం చేశారు.

ప‌నుల వ‌చ్చిన త‌ల్లిదండ్రులు ఇంట్లో బాలిక క‌నిపించ‌క‌పోవ‌డంతో చుట్టుప‌క్క‌ల వెతికారు. ఇంత‌లో ప‌క్క బిల్డింగ్‌పై నుంచి బాలిక ఏడుపు వినిపించ‌గా కిందికి తీసుకొచ్చారు. ఏం జ‌రిగింద‌ని త‌ల్లిదండ్ర‌లు ఆరా తీయడంతో బాలిక జ‌రిగిందంతా చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 19 నుంచి 29 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న ఐదుగురు నిందితులతోపాటు వారికి స‌హ‌క‌రించిన మైన‌ర్ బాలుడు, మ‌హిళ‌ను అర‌స్ట్ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.