గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 13:54:14

అక్రమంగా త‌ర‌లిస్తున్న రేషన్ బియ్యం సీజ్‌

అక్రమంగా త‌ర‌లిస్తున్న రేషన్ బియ్యం సీజ్‌

ఖ‌మ్మం: ‌జిల్లాలోని జూలూరుపాడు మండలంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న రేష‌న్ బియ్యాన్ని పోలీసులు సీజ్‌చేశారు. మండ‌లంలోని కాకర్ల గ్రామ శివార్లలో రేషన్ బియ్యాన్ని లారీల్లో లోడ్ చేస్తుండగా సీఐ రమేష్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. అయితే పోలీసులు వ‌స్తున్నార‌నే విష‌యాన్ని గ‌మ‌నించిన అక్ర‌మార్కులు లారీని అక్కడే వదిలి  పరారయ్యారు. అందులో సుమారు 120 క్వింటాళ్ల బియ్యం ఉంటుంద‌ని స‌మాచారం. లారీని సీజ్ చేసిన‌ పోలీసులు జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


logo