ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 27, 2020 , 15:47:48

బాలికపై లైంగికదాడి.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

బాలికపై లైంగికదాడి.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

గ్రేటర్‌ నోయిడా : ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో రెండురోజుల క్రితం మైనర్‌ బాలిక(12)పై లైంగిక దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నోయిడాలోని ఎకోటెక్ -3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. మంగళవారం రోజువారీగా తల్లిదండ్రులు పనికి వెళ్లగా బాలిక ఇంట్లోనే ఉంది. గుర్తుతెలియని వ్యక్తి మధ్యాహ్నం ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

నేరం చేసిన సమయంలో నిందితుడు ఫేస్ మాస్క్ ధరించడం, బాధితురాలు సైతం అతడిని తొలిసారి చూడడం, ప్రత్యక్ష సాక్షి లేకపోవడంతో నేరస్తుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. పలు పోలీసు బృందాలు రంగంలోకి దిగి చివరకు నిందితుడి ఆచూకీ గుర్తించాయి. అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లగా పారిపోయేందుకు యత్నించడంతో కాల్పులు జరుపగా గాయపడి పట్టుబడినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (మహిళా భద్రత) బృందా శుక్లా తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo