యూపీలో 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి, హత్య

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పశువులకు మేతకోసం వెళ్లిన మైనర్ బాలికపై దుండగులు లైంగిక దాడికిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్యచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా పురెందర్‌పూర్‌లో గత సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఈనెల 18న బాధితురాలి తల్లి పశువుల మేతకోసం అడవిలోకి వెళ్లింది. గడ్డిని ఇంటికి తీసుకువెళ్లడానికి సైకిల్ తీసుకుని రావాలని తన 12 ఏండ్ల కూతురికి చెప్పింది. దీంతో తల్లి వెళ్లిన కొద్దిసేపటికి ఆ బాలిక అడవిలోకి పయణమయ్యింది. అయితే ఆ బాలిక ఎంతసేపైనప్పటికీ తన వద్దకు రాకపోవడంతో.. ఆమె వెతకడం ప్రారంభించింది. అదే రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అడవీ ప్రాంతంలో ఆ బాలిక సైకిల్, చెప్పులు కనిపించాయి.
కాగా, బాలిక మృతదేహాన్ని గ్రామస్థులు మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. తమ ఇంటికి 5 వందల మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఆ బాలిక రక్తపు మడుగులో పడి ఉన్నదని పోలీసులు తెలిపారు.
బాలికపై సామూహిక లైంగిదాడికి పాల్పడిన దుండగులు, అనంతరం ఆమెను హత్యచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని మహారాజ్‌గంజ్ సీనియర్ పోలీసు అధికారి ప్రదీప్ గుప్తా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తివివరాలు తెలుస్తాయని వెల్లడించారు. బాలిక తండ్రి సమీప పట్టణంలో పనిచేస్తున్నారని, వారికి మొత్తం ముగ్గురు సంతానం అని చెప్పారు. ముగ్గురిలో బాధితురాలే పెద్దదని వెల్లడించారు.
తాజావార్తలు
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్‌లైన్స్
- పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు