సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 19:18:27

మ‌త ప్ర‌చార‌కురాలిపై గ్యాంగ్ రేప్‌.. 12 ఏండ్ల బాలుడు అరెస్ట్

మ‌త ప్ర‌చార‌కురాలిపై గ్యాంగ్ రేప్‌.. 12 ఏండ్ల బాలుడు అరెస్ట్

గొడ్డా : జార్ఖండ్‌లోని గొడ్డ జిల్లాలోని ఒక ఆశ్రమంలో మ‌త‌ప్ర‌చార‌కురాలు (సాధ్వీ)పై గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డిన వారిలో 12 ఏండ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రణిదిహ్‌లోని ఆశ్రమంలో మంగళవారం జరిగిన సామూహిక లైంగిక‌దాడి కేసులో అరెస్టయిన మూడో వ్యక్తి ఈ బాలుడ‌ని.. ఎస్పీ వైఎస్ ర‌మేశ్ తెలిపారు. అదే పరిసరాల్లో నివసిస్తున్న బాలుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆశ్రమ గోడ దూకి.. లోప‌లికి ప్ర‌వేశించి మహిళపై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. అప్ప‌టికే అందులో ఉన్న స‌న్యాసులు, మ‌త బోధకులను గన్‌తో బెదిరించి రేప్‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. 

ఈ ఘ‌ట‌న గురించి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జోక్యం చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ప్రధాన నిందితులు దీపక్ రానా, ఆశిష్ రానా (18)ను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు 46 ఏళ్ల సాధ్వీపై అత్యాచారం చేశామ‌ని నేరం అంగీక‌రించిన‌ట్లు పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు త్వ‌ర‌గా శిక్ష ప‌డేలా చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo