మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 06, 2020 , 09:50:27

12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం.. శ‌రీర‌మంతా క‌త్తిపోట్లు

12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం.. శ‌రీర‌మంతా క‌త్తిపోట్లు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర్భ‌య లాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. అభం శుభం తెలియ‌ని చిన్నారిపై మాన‌వ మృగాలు విరుచుకుప‌డ్డాయి. ఆమెపై అత్యాచారం చేసి.. శ‌రీర‌మంతా క‌త్తుల‌తో పొడిచి వికృతానందం పొందారు. తీవ్ర గాయాల‌పాలైన బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ప‌శ్చిమ విహార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

ఓ 12 ఏళ్ల బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ప‌శ్చిమ విహార్‌లో ఉంటుంది. త‌ల్లిదండ్రులు, ఆమె సోద‌రి.. స్థానికంగా ఉన్న గార్మెంట్ షాపులో ప‌ని చేస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం బాలిక త‌ల్లిదండ్రులు, సోద‌రి ప‌నికి వెళ్లారు. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న బాలిక‌ను గ‌మ‌నించి.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఆమెపై అత్యాచారం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా బాలిక‌పై విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తుల‌తో దాడి చేశారు. శ‌రీరమంతా క‌త్తిపోట్లే. సాయంత్రం 5:30 గంట‌ల స‌మ‌యంలో అతి క‌ష్టంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. పొరుగింటి వారు గ‌మ‌నించి.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఎయిమ్స్ కు త‌ర‌లించారు. ఆమె త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైన‌ట్లు వైద్యులు తెలిపారు. శ‌రీర‌మంతా క‌త్తిపోట్లు ఉండ‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలి ఇంటి స‌మీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. 


logo