శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 06, 2020 , 22:26:10

అంబులెన్స్ బోల్తా.. 12 మంది క‌రోనా బాధితుల‌కు గాయాలు

అంబులెన్స్ బోల్తా.. 12 మంది క‌రోనా బాధితుల‌కు గాయాలు

ముంబై : క‌రోనా బాధితుల‌తో వెళ్తున్న ఓ అంబులెన్స్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని పుణె - ముంబై ప్ర‌ధాన ర‌హ‌దారిపై సోమ‌వారం చోటు చేసుకుంది. 12 మంది క‌రోనా బాధితుల‌ను బావ్ ధాన్ లోని కొవిడ్-19 ఐసోలేష‌న్ సెంట‌ర్ కు త‌ర‌లిస్తుండ‌గా అంబులెన్స్ బోల్తా ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితులంద‌రూ కొత్రూడ్ కు చెందిన వారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. 

మ‌హారాష్ర్ట‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 5,368 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 204 మంది మృతి చెందారు. మ‌హారాష్ర్ట‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరగా, మృతుల సంఖ్య 9,026 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 87,681 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మ‌హారాష్ర్ట‌లో క‌రోనా నుంచి కోలుకున్న వారు 54.37 శాతం మంది ఉన్నార‌ని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 

ముంబైలో అత్య‌ధికంగా 85,724, థానేలో 49,485, పుణెలో 28,966, పాల్గ‌ర్ లో 7,823, ఔరంగాబాద్ లో 6,812 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo