శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 28, 2021 , 13:09:43

కొడుకు 10 కోట్లు డిమాండ్‌.. అస‌భ్య‌క‌ర చిత్రాల‌తో బెదిరింపులు

కొడుకు 10 కోట్లు డిమాండ్‌.. అస‌భ్య‌క‌ర చిత్రాల‌తో బెదిరింపులు

ల‌క్నో : ఓ కుమారుడు త‌న తండ్రికే ముచ్చెట‌మ‌లు ప‌ట్టించాడు. రూ. 10 కోట్లు ఇవ్వ‌క‌పోతే అస‌భ్య‌క‌ర‌మైన చిత్రాలు వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో వెలుగు చూసింది. ఘ‌జియాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఈ-మెయిల్ వారం రోజుల క్రితం హ్యాక్ అయింది. ఆ త‌ర్వాత వ్య‌క్తి మెయిల్‌కు అత‌నికి సంబంధించిన అస‌భ్య‌క‌ర‌మైన చిత్రాల‌ను పంపించారు. త‌న‌కు రూ. 10 కోట్లు ఇవ్వ‌క‌పోతే ఆ ఫోటోల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఫోటోల‌ను కూడా వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించాడు. దీంతో అత‌ను భ‌య‌ప‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

బెదిరింపుల‌కు పాల్ప‌డింది కుమారుడే..

అయితే ఆ వ్య‌క్తి మెయిల్‌ను హ్యాక్ చేసింది.. ఆయ‌న కుమారుడే(11) అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. దీంతో కుటుంబ స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు. ఐదో త‌ర‌గ‌తి చదువుతున్న ఆ బుడ్డోడు.. మెయిల్‌ని ఎలా హ్యాక్ చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న‌ట్లు తేలింది. ఆ త‌ర్వాత తండ్రి మెయిల్‌ను హ్యాక్ చేసి.. యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌, ఫోన్ నంబ‌ర్‌ను మార్చాడు. ఇక అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోల‌తో తండ్రిని బెదిరిస్తూ రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడు.

VIDEOS

logo