శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 24, 2020 , 16:37:24

11 ఏళ్ల బాలిక‌పై నాలుగేళ్లుగా తండ్రి అత్యాచారం

11 ఏళ్ల బాలిక‌పై నాలుగేళ్లుగా తండ్రి అత్యాచారం

పంజాబ్ : అత‌ను మ‌నిషి కాదు.. మాన‌వ మృగం. అభం శుభం తెలియ‌ని ఆ బిడ్డ‌ను కంటికి రెప్పాల్సిన కాపాడుకోవాల్సిన తండ్రే ఆమెపై కామంతో క‌న్నేశాడు. ఇంట్లో భార్య లేని స‌మ‌యంలో సొంత బిడ్డ‌పై అత్యాచారం చేసి రాక్ష‌సానందం పొందాడు.

పంజాబ్ ప‌టియాలా జిల్లాలోని క‌న్సుహా గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తికి భార్య‌, ఇద్ద‌రు అమ్మాయిలు, ఒక మ‌గ పిల్లాడు ఉన్నాడు. ఆయ‌న భార్య త‌రుచూ దైవ‌ద‌ర్శ‌నాల కోసం బ‌య‌ట‌కు వెళ్లేది. అలాంటి స‌మ‌యాల్లో.. ఇంట్లో ఉన్న భ‌ర్త‌.. రెండో సంతాన‌మైన ఆడ‌బిడ్డ‌పై క‌న్నేశాడు.

ఆమెకు ఎనిమిదేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్ప‌ట్నుంచి.. తండ్రి అత్యాచారం చేస్తున్నాడు. విష‌యం బ‌య‌ట‌కు చెప్తే చంపేస్తాన‌ని బిడ్డ‌ను ఆయ‌న బెదిరించేవాడు. ఇటీవ‌లే బాలిక‌కు క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి వ‌చ్చింది. దీంతో జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లికి చెప్పింది బిడ్డ‌. 

భ‌ర్త ఘోరాల‌ను తెలుసుకున్న భార్య షాక్ అయింది. త‌న బిడ్డ‌కు జ‌రిగిన ఘోర అవ‌మానంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అత‌నిపై పోలీసులు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చ‌ట్టం ప్ర‌కారం నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెప్పారు. 


logo