బాలికపై సామూహిక లైంగిక దాడి

భోపాల్ : ఎన్నిచట్టాలు కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. మృగాళ్ల పశువాంఛకు పసి మొగ్గలు సైతం బలవుతున్నారు. శనివారం మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో బాలిక(11 )పై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. తలిదండ్రులు సబ్బు తీసుకురమ్మని బాలికను దుకాణానికి పంపగా పొరుగింటి వ్యక్తి బాలికను అడ్డగించి ఇంట్లోకి లాక్కెళ్లాడు. అక్కడ మరో ఇద్దరితో కలిసి ఆమెపై లైంగిక దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వదిలేశారు. అంతర్గత గాయాలు కావడంతో భయపడిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు