గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 26, 2020 , 17:29:18

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 102 మంది అరెస్టు

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 102 మంది అరెస్టు

పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బరాసత్‌ జిల్లాలోని ఉత్తర 24 పరగణాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన  102 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాస్కులు ధరించకపోవడం, అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు బరాసత్ ఎస్పీ అభిజిత్ బంద్యోపాధ్యాయ తెలిపారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం  వారంలో రెండు రోజులు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారంలో మొదటి (సోమవారం)తోపాటు మరోరోజు లాక్‌డౌన్‌ నిబంధన అమలులో ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 56,377 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 19,391 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి బారినపడి 35,654 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 1,332 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ తెలిపింది.

logo