అదుపుతప్పి ట్రక్కు బోల్తా.. 10 మంది జవాన్లకు తీవ్రగాయాలు

గిరిధి : ఝార్కండ్లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 154 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు మధుబన్ నుంచి నిమియాఘాట్‌కు వెళ్తుండగా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఒక్కసారిగా పశువులు అడ్డురావడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడినట్లు పేర్కొన్నారు. గాయపడిన జవాన్లును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్లో రాంచీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భ్యార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..