బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 17, 2020 , 21:38:56

రాజ‌స్థాన్‌కు త‌ర‌లిస్తున్న‌ గంజాయి ప‌ట్టివేత‌.. 10 మంది అరెస్టు

రాజ‌స్థాన్‌కు త‌ర‌లిస్తున్న‌ గంజాయి ప‌ట్టివేత‌.. 10 మంది అరెస్టు

ఖమ్మం : వాహ‌న త‌నిఖీల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప‌ది మంది వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ వద్ద పోలీసులు గురువారం సాయంత్రం వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఒడిశా నుంచి రాజ‌స్థాన్‌కు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 95 కేజీల గంజాయిని గుర్తించి ప‌ట్టుకున్నారు. ఖమ్మం త్రీ టౌన్ సీఐ శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటస్వామి, రవికుమార్, ఎస్ఐ సతీష్ కుమార్, ప్రసాద్, త్రీ టౌన్  ఎస్ఐ శ్రవణ్ కుమార్ వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు. 

అనుమానాస్పదంగా వస్తున్న కారు, ఆటోలను అపి తనిఖీ చేయగా రూ. 14.25 లక్షల రూపాయల విలువ చేసే 95 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలింపులో భాగంగా మార్గం మధ్యలో ఉన్న ఖమ్మం నగరం వరకు కారు, ఆటోలో తెచ్చి అనంత‌రం ఆ గంజాయిని లారీలో లోడు చేసుకొని రాజస్థాన్‌కు తీసుకెళ్లెందుకు నిందితులు పథ‌కం రచించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంక‌ట్రావ్ వెల్ల‌డించారు. 

నిందితులను ఒడిశా రాష్ట్రం మ‌ల్క‌న్‌గిరి జిల్లాకు చెందిన ప‌రితోష్ స‌ర్దార్‌(38), పాడి స‌త్య‌నారాయ‌ణ‌(25), గణేష్ ముఖర్జీ(50), రింకు, చ‌క్వార్ సునా(17), అజ‌య్ కాసిం(18), కె. త‌రుణ్‌(17), మున్నా హ‌రిజ‌న్‌(15), రాజ‌స్థాన్‌కు చెందిన పీదేహ్సిల్ సుగుణ రామ్(30), సూబాన్(23)గా పోలీసులు గుర్తించారు. logo