మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 10:37:10

రూ. 35 లక్షల విలువైన మెథాంఫేటమిన్‌ మాత్రలు స్వాధీనం

రూ. 35 లక్షల విలువైన మెథాంఫేటమిన్‌ మాత్రలు స్వాధీనం

ఛాంపై : మిజోరాంలోని  ఛాంపై జిల్లా మెల్‌బుక్‌ ప్రాంతంలో రూ .35 లక్షల విలువైన 10 వేల మెథాంఫేటమిన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం రైఫిల్స్ తెలిపింది. మెల్‌బుక్‌ ప్రాంతంలో కొందరు అక్రమంగా రవాణా చేస్తున్న మాత్రలను అస్సాం రైఫిల్స్‌లోని సెర్చిప్ బెటాలియన్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. మెథాంఫేటమిన్ కేంద్ర నాడీ వ్యవస్థను శక్తివంతంగా ప్రభావితం చేయడమే కాకుండా వ్యసన ఉద్దీపన కలగజేస్తుంది. యువత ఈ మాత్రలను మత్తుకోసం వినియోగిస్తుండటంతో అంతర్జాతీయంగా వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo