సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 17, 2020 , 16:08:31

10 ఆస్ప‌త్రులు నిరాక‌రించాయి.. ప‌సిపాప మృతి

10 ఆస్ప‌త్రులు నిరాక‌రించాయి.. ప‌సిపాప మృతి

బెంగ‌ళూరు : నెల రోజుల ఓ ప‌సిపాప గుండె సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. ఆ చిన్నారిని బ‌తికించుకునేందుకు ప‌ది ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగారు. కానీ ఏ ఒక్క ఆస్ప‌త్రి కూడా ఆ పాప‌ను అడ్మిట్ చేసుకోలేదు. చివ‌ర‌కు ఆ ప‌సిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘ‌ట‌న బెంగ‌ళూరులో సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

బ‌స‌వేశ్వ‌ర‌న‌గ‌ర్ ఏరియాలో ఉంటున్న ఓ ప్ర‌యివేటు ఉద్యోగికి పాప ఆక‌స్మికంగా అనారోగ్యానికి గురైంది. స్థానికంగా ఉన్న డాక్ట‌ర్ కు చూపిస్తే.. ఆ బిడ్డ‌కు గుండె సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు చెప్పాడు. త‌క్ష‌ణ‌మే మెరుగైన వైద్యం అందించాల‌ని సూచించాడు. దీంతో ఆదివారం ఉద‌యం నుంచి సోమ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు క‌నీసం ప‌ది ఆస్ప‌త్రుల చుట్టూ పాప‌ను తిప్పాడు. కానీ ఏ ఒక్క డాక్ట‌ర్ కూడా ఆ పాప‌కు వైద్యం అందించ‌లేదు. క‌రోనా భ‌యంతో ఆస్ప‌త్రి గ‌డ‌ప తొక్క‌నీయ‌లేదు. చివ‌ర‌కు ఆ ప‌సిపాప ప్రాణాలు కోల్పోవ‌డంతో త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.  


logo