సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 16:26:09

అమెరికాలో కాల్పులు : వ్యక్తి మృతి.. 8 మందికి గాయాలు

అమెరికాలో కాల్పులు : వ్యక్తి మృతి.. 8 మందికి గాయాలు

వాషింగ్టన్‌ : వాషింగ్టన్‌ వాయవ్య ప్రాంతంలోని కొలంబియా హైట్స్ 14వ వీధి స్ప్రింగ్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యక్తి మృతి చెందగా.. మరో 8 మంది గాయపడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. గాయపడిన వారి వివరాలను త్వరలో ధ్రువీకరిస్తామని పోలీసు ప్రతినిధి పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన వారందరూ పెద్దలేనని చెప్పారు. దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిందని, ఒకరు మరణించినట్లు ధ్రువీకరించిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ముగ్గురు ఆఫ్రికన్లు-అమెరికన్‌ పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.
logo