శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 12:10:19

లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయి పట్టివేత

లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖపట్నం : లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న ఘటన విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం లింగంపేటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేట వద్ద రోజు వారీ విధుల్లో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగు వ్యక్తుల్లో ఇద్దరు పరారవగా.. మరో ఇద్దరిని పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.

లారీలో సుమారు 1,200 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు 2 సెల్ ఫోన్లు, లారీని స్వాధీనం తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేడీపేట ఎస్ఐ భీమరాజు తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo