శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 16:36:34

1,027 కేజీల గంజాయి ప‌ట్టివేత‌

1,027 కేజీల గంజాయి ప‌ట్టివేత‌

గజపతి : ఓ ట్రక్కు నుంచి రూ.50 లక్షలకు పైగా విలువ జేసే 1,027 కిలోల గంజాయిని ఒడిశా పోలీసులు శుక్రవారం ప‌ట్టుకొని వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గ‌జ‌ప‌తి జిల్లా ఆర్‌ ఉదయగిరి గ్రామ ప‌రిధిలో బురాపాద‌ర్ నుంచి చత్తీస్‌గ‌ఢ్‌కు కంటైనర్ వాహనంలో గంజాయిని త‌ర‌లిస్తుండ‌గా దాడులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. బీహార్‌కు చెందిన డ్రైవర్ ధరంబీర్ కుమార్ సింగ్‌ను అరెస్టు చేసి కేసు న‌మోదు చేశామ‌ని పేర్కొన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo