కావలసిన వస్తువులు: గోధుమపిండి: రెండు కప్పులు, స్వీట్ కార్న్: అర కప్పు, ఉల్లిపాయ: చిన్నది, క్యాప్సికం, క్యారెట్ తురుము: అర కప్పు, సోయా సాస్: పావు టీ స్పూన్, చిల్లీ సాస్: ఒక టీ స్పూన్, అజినొమొటొ: చిటికెడు, మిరియాలపొడి: చిటికెడు, టమాట సాస్: ఒక టీ స్పూన్, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: రెండు, నూనె: సరిపడా.
తయారీ విధానం: గోధుమపిండిలో చిటికెడు ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు కలుపుతూ, చపాతీ పిండిలా తడిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని ఆవిరిమీద ఉడికించి పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కాస్త మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికం తురుము వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, టమాట సాస్, తగినంత ఉప్పు, అజినొమొటొ, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి మరో రెండు నిమిషాలు వేయించి దింపేయాలి. పిండిని బాగా కలిపి, ఉండలు కట్టుకుని చపాతీలు చేసుకోవాలి. చపాతీని రెండువైపులా కాల్చుకోవాలి. వేడివేడి చపాతీ మధ్యలో కూర పెట్టి, మడత పెట్టి
సర్వ్ చేయాలి.