e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home బతుకమ్మ చుట్టలు చుట్టీ తిందామా!

చుట్టలు చుట్టీ తిందామా!

చామకూర ముద్దపప్పులోకి వేడివేడి నెయ్యి వేసుకొని లాగిస్తే ఒంట్లోకి ఎక్కడ లేని
చేవ వస్తుంది. అదే చామదుంపల అంటుపులుసు దగ్గరికొస్తే, రెండు వేళ్లతో పులుసు అద్దుకొని జిహ్వకు తగిలించగానే ఆ రుచికి నాలుక మడతపడి ‘ప్ట్‌ఁ…’ అన్న శబ్దం చేస్తుంది. చామదుంపల కూర పళ్లెంలో ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువగా లాగించడం, కంటి నిండా కునుకుతీయడం పరిపాటే! ఇదే చామకూరతో పొట్లాలు కూడా చుట్టుకుంటారు! ఈ వెరైటీ వంటకం కథాకమామిషు ..
ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఆకుకూరల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాం. ఆకుకూరలతో పప్పులు, పచ్చళ్లు, పొడులు చేసుకోవడం పరిపాటే! ఆకుకూరల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటున్న ఆధునిక మహిళలు పాలక్‌ రోటీలు, పుదీనా పలావ్‌లు, కొత్తిమీర దోశలు.. ఇలా ప్రతి వంటకాన్నీ ఆకుకూరలతో అర్చించి స్వీయ నివేదన చేసుకుంటున్నారు. ఈ జాబితాలో చామకూర వెరైటీలకూ చోటుంది. చామకూర ముద్దపప్పు గురించి మాత్రమే మనకు తెలుసు. ఇదే కూరతో పొట్లాలు చేసుకునే వారూ ఉన్నారు. ఇది పాత వంటకమే అయినా అలవాటు తప్పింది. భోజనప్రియులు మాత్రం నమనమలాడే చామకూర కనిపించగానే కట్టలకు కట్టలు కొనేసి ఇంటికొచ్చి పొట్లాలు చుట్టేయమంటూ ఆర్డర్లిస్తారు. ‘పనెక్కువ?’ అని సమాధానం వచ్చిందా ఆ పూట పోట్లాటే!
పెద్దపెద్ద చామకూర ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి, తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, పసుపు, కారంపొడి, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, వాము, గరంమసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. చామకూర ఆకులపై ఈ మిశ్రమాన్ని పలుచగా రాయాలి. తర్వాత ఆకుని జాగ్రత్తగా చుట్టాలి. ఇలా ఆకులన్నీ చేసుకుని ఆవిరి మీద పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో వడ్డించుకోవాలి. వీటిని ప్రాంతాలనుబట్టి చామాకు చుట్టలు, చామాకు పొట్లాలు, చామాకు బడీలు.. అని పిలుస్తారు.
చామకూర ఆకులు వెడల్పుగా ఉంటాయి. చామదుంపల్లో కన్నా ఈ ఆకుల్లోనే అధిక పోషకాలు. ప్రొటీన్లు, పీచు పదార్థం, విటమిన్‌-ఎ వీటిలో పుష్కలం. తక్షణ శక్తినిస్తాయి కూడా. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తీ మెరుగవుతుంది. అధిక బరువుతో సతమతమవుతున్న వారికి చామాకు ఓ వరం. ఇందులో కార్బొహైడ్రేట్స్‌ తక్కువ. బరువు తగ్గాలనుకుంటే, సంకోచం లేకుండా చామకూరను డైట్‌లో చేర్చుకోవాలి.
చామాకులో విటిమిన్‌- ఎ, కె, ఇ పుష్కలం. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తాయి. శ్వాస సంబంధ సమస్యలను, యూరినరీ, పేగు రుగ్మతలను నివారించడంలో సహాయపడుతాయి. తరచూ తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇందులోని ఫ్లేవనాయిడ్‌ ట్రైన్యూట్రియంట్స్‌ యాంటీ క్యాన్సర్‌ గుణాలను కలిగి ఉంటాయి. ఇది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధించడానికి సాయపడుతుంది. దీనిలోని మెగ్నీషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఫొల్లెట్‌ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement