కావలసిన పదార్థాలు
స్వీట్ పొటాటో (కందగడ్డలు): రెండు(పెద్దవి), కారం: అర టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: ఒక టీస్పూన్, ఆరిగానో: అర టీస్పూన్, చాట్ మసాలా: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
కందగడ్డలను బాగా కడిగి, తొక్కతీసి నిలువు ముక్కలుగా కోసి పది నిమిషాలు నీళ్లలో నాన బెట్టాలి. ఒక గిన్నెలో నానిన కందగడ్డ ముక్కలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, ఆరిగానో, నూనె వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు పక్కనపెట్టాలి. వీటిని ట్రేలో విడివిడిగా పేర్చి ఓవెన్లో కానీ, ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఫ్రై చేసి పైనుంచి చాట్ మసాలా, కొత్తిమీర తురుము చల్లితే వేడివేడి స్వీట్ పొటాటో ఫ్రైస్ సిద్ధం. ఇవి టమాట సాస్‌తో బాగుంటాయి.