కావలసిన పదార్థాలు
చికెన్ (బోన్‌లెస్): ఒక కప్పు, జీడిపప్పు: పావు కప్పు, శెనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్, మైదా: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: రెండు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్,
మిరియాల పొడి: పావు టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, నూనె: సరిపడా, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా, ఫుడ్ కలర్: చిటికెడు
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను బాగా కడిగి చిన్నచిన్న ముక్కల్లా కోసుకోవాలి. గిన్నెలో చికెన్, జీడిపప్పు, శెనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, తురిమిన పచ్చిమిర్చి, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఫుడ్‌కలర్ వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి, వేడయ్యాక చికెన్ మిశ్రమాన్ని విడివిడిగా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. పైనుంచి కరివేపాకు, కొత్తిమీర తురుము చల్లుకుంటే కరకరలాడే కాజూ చికెన్ పకోడి సిద్ధం.