కావలసిన పదార్థాలు
మక్కజొన్న గింజలు (కార్న్): ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర: కొద్దిగా, జీలకర్ర: అర టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
మక్కజొన్న గింజల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మక్కజొన్న, ఆలూ ముద్ద, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక కార్న్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని కట్లెట్లుగా ఒత్తుకొని దోరగా వేయించుకుంటే రుచికరమైన కార్న్ కట్లెట్ సిద్ధం.