ఆలుగడ్డ పొట్టు: ఒక కప్పు, చక్కెర: అర కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, కోవా: పావు కప్పు, యాలకుల పొడి: పావు టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్: పావు కప్పు
ముందుగా స్టవ్‌మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి, అవి మరుగుతుంటే ఆలుగడ్డ తొక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత వడకట్టి ఆర బెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో చక్కెర వేసి, అందులో కప్పు నీళ్ళుపోసి కలుపుతూ మరిగించాలి. స్టవ్‌మీద మరో గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. బాగా వేడయ్యాక తరిగిన డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, అదే పాన్‌లో ఆరబెట్టిన ఆలుగడ్డ తొక్కలను వేసి బాగా వేయించి, కొద్దికొద్దిగా చక్కెర ద్రవాన్ని పోస్తూ దగ్గర పడేవరకూ ఉడికించాలి. బాగా దగ్గర పడుతున్నప్పుడు యాలకులపొడి, కోవా వేసి బాగా కలిపి, వేయించిన డ్రై ఫ్రూట్స్‌తో అలంకరిస్తే.. ఆలూ తొక్కల హల్వా రెడీ.