కావలసిన పదార్థాలు
స్ట్రాబెర్రీ: అయిదు, చింతపండు గుజ్జు: రెండు టేబుల్ స్పూన్లు, బెల్లం: చిన్నముక్క, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, టమాట: ఒకటి, ఉప్పు: తగినంత, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర: అర టీస్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున.
తయారీ విధానం
మిక్సీ జార్లో స్ట్రాబెర్రీ ముక్కలు వేసి మెత్తగా నూరుకుని పక్కన పెట్టాలి. అదే జార్లో టమాట ముక్కలు, చింతపండు గుజ్జు, బెల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఒక గిన్నెలో స్ట్రాబెర్రీ పేస్ట్, చింతపండు మిశ్రమం వేసి తగినన్ని నీళ్లుపోసి కలుపుకోవాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి నూనె వేడయ్యాక.. ఆవాలు జీలకర్ర వేయాలి. ఆ దినుసులు వేగాక మిశ్రమం వేసి కలుపుకోవాలి. బాగా మరిగించి స్టవ్ ఆపేసి పైనుంచి కొత్తిమీర తురుము, స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకుంటే స్ట్రాబెర్రీ రసం సిద్ధం.