మష్రూమ్స్ (పుట్టగొడుగులు): ఒక కప్పు, బ్రెడ్ైస్లెసెస్: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, వెన్న: అర కప్పు,క్రీమ్ చీజ్: అర కప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు.
తయారీ విధానం
మష్రూమ్స్‌ను ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, మష్రూమ్ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక మిరియాల పొడి, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించి దించేయాలి. బ్రెడ్ ైస్లెస్పై క్రీమ్ చీజ్ రాసి, మష్రూమ్ మిశ్రమం పరిచి, పైనుంచి మరో ైస్లెస్ ఉంచాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి, అప్పటికే తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ ైస్లెసెస్ను రెండు వైపులా వెన్న వేసి కాల్చుకుంటే మష్రూమ్ టోస్ట్ రెడీ.