కావలసిన పదార్థాలు
ఉడికించిన నూడుల్స్: ఒక కప్పు, వెల్లుల్లి తురుము: ఒక టీస్పూన్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్: అర టీస్పూన్, సోయాసాస్: రెండు టీస్పూన్లు, షేజ్వాన్ సాస్: ఒక టేబుల్ స్పూన్, టమాట సాస్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, వేయించిన తెల్ల నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
ఒక గిన్నెలో వెల్లుల్లి తురుము, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, సోయాసాస్, షేజ్వాన్ సాస్, టమాట సాస్, ఉప్పు, నువ్వులు వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక వెల్లుల్లి మిశ్రమం, నూడుల్స్, ఉల్లి
కాడలు వేసి బాగా కలిపితే వేడివేడి నూడుల్స్ సిద్ధం.