కావలసిన పదార్థాలు:
క్యారెట్లు: మూడు (పెద్దవి), కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, మైదా: ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి: ఒక టీస్పూన్, సోయా సాస్: ఒక టీస్పూన్, ఫుడ్ కలర్: చిటికెడు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి ముద్ద: అర టీస్పూన్, నూనె: సరిపడా.
తయారీ విధానం: ముందుగా క్యారెట్‌ను ముక్కలుగా కోసి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ , సోయాసాస్, మిరియాలపొడి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉడికించిన క్యారెట్ ముక్కలను వేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో క్యారెట్ ముక్కనూ నూనెలో వేయించాలి. మరో కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వేయించి.. అందులో వేయించిన క్యారెట్ ముక్కలు వేసి కలిపి దించితే, వేడివేడి క్యారెట్ 65 రెడీ.