కావలసిన పదార్థాలు
అటుకులు: ఒక కప్పు (లావుగా ఉండేవి), పల్లీలు: అర కప్పు చక్కెర: అర కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం, కాజు, కిస్మిస్: పావు కప్పు, యాలకుల పొడి: చిటికెడు.
తయారీ విధానం
అటుకులను సన్నని మంటపై అయిదు నిమిషాల పాటు వేయించాలి. దోరగా వేగాక చల్లార్చి పొడి చేసుకోవాలి. పల్లీలు వేయించి, పొట్టుతీసి పొడి చేసుకోవాలి. చక్కెర కూడా మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించాలి. ఒక గిన్నెలో అటుకులు, చక్కెర, పల్లీల పొడులు, నెయ్యితోపాటు డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూలు చేసుకుంటే నోరూరించే అటుకుల లడ్డూ సిద్ధం. చక్కెర తినని వాళ్లు బెల్లం పొడి వేసుకోవచ్చు.