కావలసిన పదార్థాలు
ఆలుగడ్డ: రెండు, దానిమ్మ గింజలు: ఒక కప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: ఒక టీస్పూన్, చాట్ మసాలా: ఒక టీస్పూన్, పుదీనా తరుగు: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నిమ్మ రసం: ఒక టీస్పూన్
తయారీ విధానం
ముందుగా ఆలూ ఉడికించుకుని ముక్కలుగా చేసుకోవాలి. అందులో దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, నిమ్మ రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇష్టమైతే ఈ చాట్లో గ్రీన్ చట్నీ, సన్న కారప్పూస కూడా వేసుకోవచ్చు.