e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home వంటలు దంచికొడదాం..దప్పళం!

దంచికొడదాం..దప్పళం!

ఐతారం దావత్‌
విస్తరిలో.. పప్పు, కూరలకు కాస్త దప్పళం తోడైతేనే విందు పరిపూర్ణం. అతిథి దేవుడు తేన్పుల ఆశీస్సులు కురిపిస్తాడు. పులుపు, తీపి కలగలిసిన రుచితో సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయల దండుతో నోరూరించే దప్పళం.. శాకాహార మణిహారం!

సాంబారు, రసం, ఛోళే అంటూ ఇప్పుడన్నీ ‘పొరుగు’ కూరలే కంచంలో కొలువుదీరుతున్నాయిగానీ, తెలంగాణ పల్లెల్లో తరాలనుంచీ నోరూరిస్తున్న వంటకాలెన్నో. అలా మన అమ్మమ్మలు, నానమ్మల వంటింటి ప్రయోగశాలలో ఆవిష్కృతమైన ఓ అద్భుత వంటకం.. దప్పళం. కూరగాయలన్నీ కట్టగట్టుకొని పళ్లెంలో తిష్టవేసి మరీ, మన జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి. ‘మానవా నన్నందుకోవా?’ అని ఊరిస్తాయి.

- Advertisement -

తెలంగాణలోవేపుళ్ళు, కూరలకంటే పులుసులకే ప్రాధాన్యం.మన పచ్చిపులుసు రుచి ఎల్లలు దాటేసింది. బెండ, దొండ, సొరకాయ, మునక్కాయ, గుమ్మడికాయ, కంద, చేమ, కాకరకాయ వంటి కూరగాయల పులుసులే కాదు.. రొయ్యలు, చేపలు, బొమ్మిడాలు వంటి నాన్‌-వెజ్‌ పులుసులూ ఈ గడ్డ మీద రాజ్యమేలు తున్నాయి.

దప్పళాన్నే కొన్ని ప్రాంతాల్లో ముక్కల పులుసు అనీ అంటారు. చాలామంది దప్పళం అంటే సాంబారనే అనుకుంటారు. కానీ దప్పళం వేరు, సాంబారు వేరు. రకరకాల కూరగాయ ముక్కలతో చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తీమీర దట్టించి కాస్త చింతపండు పులుసుతోపాటు బెల్లంకానీ చక్కెరకానీ జోడించి చేసేదే.. దప్పళం.

చింతపండుతోనే కాదు, సీజన్‌లో పచ్చి చింతకాయలను ఉడకబెట్టి తీసిన పులుసుతోనూ దప్పళం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కందగడ్డ, బుడమకాయ ముక్కలనూ జోడిస్తారు. ఆ రుచి అదరహో!

పోషక పరమైన విలువల్లో కూడా దప్పళానికి తిరుగులేదు. రకరకాల కూరగాయలు జోడించడం వల్ల, వాటిలోని విటమిన్లు నేరుగా శరీరానికి అందుతాయి. అందులోనూ, నూనెలో వేయించకుండా పులుసులో ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరయ్యే ప్రమాదం ఉండదు. పప్పు జతచేయడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి.

చింతపండుకు కాస్త బెల్లం జోడించడంతో ఆమ్లగుణాలు నశించి శరీరానికి మేలు చేస్తుంది. కొన్నిప్రాంతాల్లో బెల్లానికి బదులు చక్కెర వేస్తారు. రుచికైనా, పోషకాలకైనా బెల్లమే ఉత్తమం. ఇష్టమైతే కాస్త ఇంగువ పోపు పెట్టుకుంటే, వాసన అదిరిపోతుంది. ఎందుకు ఆలస్యం? మీరూ అమ్మనో, అమ్మమ్మనో అడిగి చేసేయండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana